Eedu Magadentra Bujji Song Lyrics
Eedu Magadentra Bujji Song Lyrics

Song Lyrics
Eedu Magadentra Bujji Song Lyrics
ఈడు మగడంట్రా బుజ్జి..!
హ, జోక్ ఏసాడు చూడు,
ఈడు మగడంట్రా బుజ్జి
ఈడి ఏషాలు..!!
ఈడు మగడేంట్రా బుజ్జి..?
అదే కదా బాబాయ్…
ఈడు మగడేంట్రా బుజ్జి..?
అది తేల్చేద్దాం పద ఎహే…
ఈడు మగడంట్రా బుజ్జి..!
జోక్ ఏసాడు చూడు,
ఈడు మగడంట్రా బుజ్జి
ఈడి ఏషాలేంటో..!
ఈడు మగడేంట్రా బుజ్జి..?
అదే కదా బాబాయ్…
ఈడు మగడేంట్రా బుజ్జి..?
అది తేల్చేద్దాం పదెహే…
వీడి చెల్లి దేవతంట
ఆడి చెల్లి ఐటమంట…
మగతనం మీనింగే మార్చేసి మగాడంట
తాగుడంట వాగుడంట, భార్యల్ని కొట్టుడంట
భార్య పైన చెయ్యినేత్తే వీడు పెద్ద మగాడంట??
దేవతంట, పూజలంట
పూజ చేసి మొక్కుడంట
దేవతని చూసే చూపు గుడి ఆవల మారునంట
వండి వంట పెట్టాలంట
పనులు చేస్తూ మొత్తం ఇంట
ఈడు మాస్టర్ ఛెఫ్ లాగా
రివ్యూలు చెప్పేనంట…
ఈడి పైన సారు అంట
ఈడి పైన అరిచెనంట
అమ్మ ఆలీ పైన మంట
ఇంటికొచ్చి చూపెనంట
ఫోన్లోని బార్ లోని గంట్ల సోది వాగుడంట
ఇంట్లోని ఆడాల్లతో మాట మంచి ఉండదంట
నొపినిచ్చి కయ్యుమనవ్
నొప్పి పుడితే అమ్మ అంటావ్
అమ్మ వయసు పెరిగేసరికి
కొట్టి నువ్వు కసురుకుంటవ్
ఆడాళ్ళని బొమ్మ చేసి
ఆడేవాడు మగాడంట
మగతనం మీనింగే
మార్చేసి మగాడంట?
ఈడు మగడంట్రా బుజ్జి..!
హ, జోక్ ఏసాడు చూడు,
ఈడు మగడంట్రా బుజ్జి
ఈడి ఏషాలు..!!
ఈడు మగడేంట్రా బుజ్జి..?
అదే కదా బాబాయ్…
ఈడు మగడేంట్రా బుజ్జి..?
అది తేల్చేద్దాం పద ఎహే…
ఓ మాట చెప్పు బాబాయ్..?
అసలు మగాడంటే ఎవడు?
ఓ మాట చెప్పు బాబాయ్..?
ఆ మగతనం అంటే ఏంటి?
నేను చెప్పనా బాబాయ్
నువ్వేం చేస్తున్నావో..?
నేను చెప్తా బాబాయ్
మగాడంటే ఎవడో?
చూస్తే నిన్ను భయం కాదు
రావాలిరా ధైర్యం
నీ చూపులో ప్రేమ నింపు
కారుతుంది కామం
అర్ధం కాలే విషయం చెప్పు
మీకే పోయే కాలం
వావి వరసలు వదిలేసి
అదేం పాడు ఆనందం
ఓరయ్య ఇన్స్టాలో స్టోరీలు
లేడీస్ పై కొటేషన్లు
ఇంటర్నెట్ బయటకు వస్తే
చేసేవన్నీ రోట్ట పనులు
ముసలొల్లే గాని మహానుభావులు
మహానుభావుల్లో కొందరున్నారు ఎదవలు
మనవరాలి వయసున్న పిల్లలపై మృగాళ్ళు
పిల్లలకి స్కూల్లోని చెప్పమంటే పాఠాలు
కొందరెదవలేస్తారు పాడు ఎర్రి ఏషాలు
ఈడు మగడంట్రా బుజ్జి..!
హ, జోక్ ఏసాడు చూడు,
ఈడు మగడంట్రా బుజ్జి
ఈడి ఏషాలు..!!
ఈడు మగడేంట్రా బుజ్జి..?
అదే కదా బాబాయ్…
ఈడు మగడేంట్రా బుజ్జి..?
అది తేల్చేద్దాం పద ఎహే…
ఓ మాట చెప్పు బాబాయ్..?
అసలు మగాడంటే ఎవడు?
ఓ మాట చెప్పు బాబాయ్..?
ఆ మగతనం అంటే ఏంటి?
నేను చెప్పనా బాబాయ్
నువ్వేం చేస్తున్నావో..?
నేను చెప్తా బాబాయ్
మగాడంటే ఎవడో?
మగతనం అంటే… మగాడికన్నా
కొంచెం బలం తక్కువని,
ఆడాళ్ళని కొట్టి హింసించి,
నీకు ఇష్టం వచ్చినట్టు
ఆడుకునే బొమ్మల తయారు చేసి
జీవితాంతం నీ కాళ్ళ కింద పడేసి
సేవ చేయించడం కాదు బాబాయ్…
మగతనం అంటే
ఒక నాన్నగా చూపించాల్సిన ప్రేమ,
ఒక అన్నగా తీసుకోవాల్సిన బాధ్యత,
ఓక తమ్ముడిగా ఇవ్వాల్సిన గౌరవం.
బాబాయ్… ఇప్పుడు చేప్పిందంతా మనలాంటోళ్ల కోసమే
అంటే మగాళ్లని చెప్పుకు తిరిగే మగాళ్ళ కోసం
ఏం చూస్తున్నావ్…
ఒకసారి నీతోటి ఆడదాని కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
తన కళ్ళల్లో నీకు నువ్వు కనపడితే
నువ్ మగాడివే బాబాయ్…
ఇంకేంటి లేటు..?
ఎలాగూ కొటేషన్లు పెడతావుగా తెల్లార్లుజామునే
రెస్పెక్ట్ ఉమెన్, ఇది అది అంటూ…
ఇప్పుడు పెట్టు… మగాడివి అనిపించుకో ఎహే
ఉంటాను మరి నమస్తే, నమస్తే…
వీడు మగాడేరా బుజ్జి
వీడు మగాడేరా బుజ్జి…
ఏమంటావ్ చెప్పు?
నువ్వు మగాడివే కదూ, ఆ ఆ
వీడు మగాడేరోయ్….