Hilesso Hilessa Lyrical Lyrics
Hilesso Hilessa Lyrical Lyrics

Song Lyrics
ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా
అసలింత అలుపే రాదు
ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నా
కాస్తైనా అడ్డే కాదు
నీతో ఉంటే తెలియదు సమయం
నువ్వు లేకుంటే ఎంతన్యాయం
గడియారంలో సెకనుల ముళ్లే
గంటకు కదిలిందే
నీతో ఉంటే కరిగే కాలం
నువు లేకుంటె కదలదు అంటూ
నెలలో ఉండే తేదీ కూడా తేడాగయిందే
హైలెస్సా.. హైలెస్సా
నీవైపే తెరచాపను తిప్పేసా
హైలెస్సా.. హైలెస్సా
నువ్వోస్తావాని ముస్తాబై చూసా
గాల్లో ఎగిరొస్తావే మేఘాల్లో తెలుస్తా
నీ ఒళ్ళో వాలే దాక ఊసురే ఊరుకోదు
రాశా రంగులతో ముగ్గేశా చుక్కలతో
నిన్నే చూసే దాకా కనులకు నిద్దుర కనబడదు
నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుందే
ఈ గాలే వీస్తుందే నీ పిలుపల్లే
హైలెస్సా.. హైలెస్సా
నీవైపే తెరచాపను తిప్పేసా
హైలెస్సా.. హైలెస్సా
నువ్వోస్తావాని ముస్తాబై చూసా
ప్రాణం పోతున్నట్టు ఉందే నీమీదొట్టు
కల్లో ఉండే నువ్వు కళ్ళకు ఎదురుగుంటే
నేల నింగి అంటూ తేడా లేనట్టు
తారల్లోనే నడిచా నువు నా పక్కన నిలబడితే
హైలెస్సా.. హైలెస్సా
నీకోసం సంద్రాన్నే దాటేశా
హైలెస్సా.. హైలెస్సా
నీకోసం ప్రేమంతా పోగేశా
More Lyrics





